భారతదేశం, ఆగస్టు 17 -- శ్రావణ మాసం మొదటి సోమవారం వేళ తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. నేడు నాగుల పంచమి పర్వదినం కూడా తోడవడంతో భక్తులు ఉదయమే లేచి శివాలయాలను దర్శించుకుంటున్నారు. ఈ ప్రత్యేక రోజున ఉపవాసాలు ఆచరించి, పరమశివుని పూజించడంతో పాటు సోమవార వ్రత కథను చదవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా భక్తుల కోసం ఆ పవిత్ర వ్రత కథ మరియు విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.

నాటి రోజుల్లో ఒక ధనవంతుడైన షావుకారు ఉండేవాడు. ఆయన నిత్యం శివ భజన చేస్తూ, పరమ శివ భక్తుడిగా పేరుగాంచాడు. ఆయన వద్ద సమస్త సంపదలు ఉన్నప్పటికీ, సంతానం మాత్రం లేదు. ఆ లోటుతోనే ఆయన ప్రతి సోమవారం వ్రతం ఆచరిస్తూ, శివాలయానికి వెళ్లి దీపారాధన చేసేవాడు.

ఒకరోజు పరమ శివుడిని పార్వతీ దేవి ఇలా ప్రశ్నించింది. "మహారాజ్, ఈ షావుకారు మీపై అచంచల భక్తి కలిగి ఉన్నాడు. ఎల్లప్పుడూ మ...