భారతదేశం, ఆగస్టు 24 -- తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ మాసానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భోళా శంకరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన శ్రావణ మాసం ఇది. ఈరోజు శ్రావణ సోమవారం వచ్చింది. ఈ సోమవారాల్లో పూజలు, వ్రతాలు ఆచరించి, శివయ్యను ఆరాధిస్తే విశేష ఫలితం దక్కుతుందని పండితులు స్పష్టం చేస్తున్నారు. కేవలం నీటితో అభిషేకం చేసినా భోళా శంకరుడు ప్రసన్నుడవుతాడని ధార్మిక విశ్వాసం.

ప్రస్తుతం కెరీర్ పరంగా ఇబ్బందులు పడుతున్నవారు, లేదా వ్యాపారంలో ఆశించిన లాభాలు రాక సతమతమవుతున్నవారు సోమవారం నాడు ఆలయానికి వెళ్లి శివలింగానికి జలాభిషేకం చేయాలి. అనంతరం మారేడు దళాలు (బిల్వ పత్రాలు) సమర్పించి, మనసారా శివనామ స్మరణ చేయాలి. 'ఓం నమః శివాయ' మంత్రాన్ని భక్తితో జపిస్తూ ఉద్యోగంలో ఎదుగుదల కోసం ప్రార్థించాలి. ఏ నిర్ణయమైనా ఆచితూచి తీసుకోవడం మంచిది.

డబ్బుకు సం...