భారతదేశం, ఆగస్టు 27 -- శ్రావణ మాసం అనగానే మనకు ముందుగా గుర్తువచ్చే పవిత్ర పండగ రక్షాబంధన్. అయితే శ్రావణ పూర్ణిమ ప్రాముఖ్యత కేవలం రాఖీ కట్టడంతోనే ముగిసిపోదు. దేశంలోని భిన్న ప్రాంతాల్లో ఈ పర్వదినాన్ని తమదైన సంప్రదాయాలు, ప్రత్యేక ఆచారాలతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ ఏడాది శ్రావణ పూర్ణిమ తిథి ఆగస్టు 27న ఉదయం 9:08 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 28 ఉదయం 9:48 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఈ పండుగను ఎంత వైభవంగా జరుపుకుంటారో ఇప్పుడు పరిశీలిద్దాం.

మహారాష్ట్ర, గోవా తదితర సముద్ర తీర ప్రాంతాల్లో శ్రావణ పూర్ణిమను 'నారలీ పూర్ణిమ'గా పిలుస్తారు. మత్స్యకార సమాజానికి చెందిన ప్రజలు ఈ ప్రత్యేకమైన రోజున సముద్ర దేవుడైన వరుణ భగవానుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. వరుణుడికి కొబ్బరికాయ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. సముద్రం ప్రశాంతంగా ఉండాలని,...