భారతదేశం, అక్టోబర్ 21 -- పరమేశ్వరుడి అనుగ్రహం పొందడానికి చాలా మంది ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. ఇది చాలా విశేషమైనది. ప్రతి నెల రెండు సార్లు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. కృష్ణ పక్షంలో వచ్చే త్రయోదశి నాడు, శుక్ల పక్షంలో వచ్చే త్రయోదశి నాడు ప్రదోష వ్రతాలను ఆచరిస్తారు. శుక్రవారం వచ్చే ప్రదోష వ్రతాన్ని శుక్ర ప్రదోష వ్రతం అని పిలుస్తారు. ఇది చాలా విశేషమైన రోజు.

మత విశ్వాసాల ప్రకారం చూసినట్లయితే, ప్రదోష వ్రతం రోజున పరమేశ్వరుడిని, పార్వతీదేవిని భక్తిశ్రద్ధలతో పూజించడం వలన ఎన్నో విధాలుగా లాభాలు కలుగుతాయి. పరమేశ్వరుడిని, పార్వతీదేవిని శుక్ర ప్రదోష వ్రతం రోజు ఆరాధించడం వలన వైవాహిక జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. సుఖసంతోషాలు కలుగుతాయి. ఐశ్వర్యం కూడా కలుగుతుంది.

అక్టోబర్ నెలలో శుక్ర ప్రదోష వ్రతం ఎప్పుడు వచ్చింది? పూజకు శుభ ముహూర్తం ఏంటి? ఎటువంట...