భారతదేశం, జూలై 15 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడి సంచారం అదృష్టానికి చిహ్నం. జీవితంలో సుఖ సంతోషాలు, అపారమైన ధన సంపద, వైభోగానికి కారకుడైన శుక్రుడు ఇప్పుడు తన స్థానాన్ని మారుస్తున్నాడు. జులై 16న శుక్రుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడికి స్వక్షేత్రమైన ఈ రాశిలో ఇప్పటికే కేతువు సంచరిస్తున్నాడు. కేతువు, శుక్రుల కలయిక ఇప్పుడు ఆయా రాశులపై ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ఎవరికి లాభం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

శుక్రుడు సాధారణంగా ఏ రాశిని కూడా ఇబ్బంది పెట్టడని పండితులు చెబుతుంటారు. అయితే, సింహ రాశిలో ఇప్పటికే ఉన్న ఛాయా గ్రహం కేతువు ప్రభావంతో ఈ సంచారం కొంత కీలకంగా మారింది. కేతువు ఒంటరితనాన్ని ఇచ్చే గ్రహం కావడంతో, శుక్రుడితో కలిసినప్పుడు ఇది కొన్ని రాశులకు ఊహించని శుభఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా వృషభం, తులా, వృశ్చిక రాశుల వారికి ఈ ...