భారతదేశం, ఆగస్టు 11 -- జ్యోతిషశాస్త్రం ప్రకారం, శుక్రుడు భౌతిక సుఖాలు, వైవాహిక ఆనందం, విలాసాలు, కీర్తి, కళలు, అందం, ప్రేమ, శృంగారం, ఫ్యాషన్ వంటి వాటికి కారక గ్రహం. శుక్రుడు వృషభ, తుల రాశులకు అధిపతి. మీన రాశిలో ఉన్నప్పుడు శుక్రుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడు, కన్య రాశిలో నీచస్థితిలో ఉంటాడు.

ఈ నెల ఆగస్టు 21న శుక్రుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. జ్యోతిష్య లెక్కల ప్రకారం, శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారికి చాలా మంచి జరుగుతుంది. ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటే, వారికి ఆర్థికంగా కూడా లాభాలు చేకూరుతాయి.

మరి, శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల ఏయే రాశుల వారికి మంచి రోజులు రాబోతున్నాయో తెలుసుకుందాం.

మేష రాశి వారికి వ్యాపారంలో ధన లాభం కలుగుతుంది. చేపట్టే పనులలో అడ్డంకులు తొలగిపోత...