భారతదేశం, జూన్ 17 -- మహారాష్ట్రలో 2022 నాటి శివసేన చీలిక ఉదంతం మళ్లీ పునరావృతం కాబోతోంది. ఈసారి లోక్‌సభ వేదికగా ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి పెద్ద షాక్ తగలనుంది. పార్టీకి ఉన్న 9 మంది లోక్‌సభ సభ్యులలో ఆరుగురు ఎంపీలు తిరుగుబాటు చేసి ప్రత్యేక గ్రూప్‌గా ఏర్పడేందుకు సిద్ధమయ్యారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. శివసేన (UBT) ఎంపీలు సంజయ్ జాదవ్, భౌసాహెబ్ వాక్‌చౌరే, సంజయ్ దేశ్‌ముఖ్, నగేష్ పాటిల్ అస్తికార్, సంజయ్ పాటిల్, మరియు ఓంరాజే నింబాల్కర్ ప్రస్తుతం ఢిల్లీలోని ఒక రహస్య ప్రాంతంలో ఉన్నారు. వీరంతా బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసి తమను ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని లేఖ ఇవ్వనున్నారు.

ఈ తిరుగుబాటు గ్రూపునకు సంజయ్ జాదవ్ నాయకుడిగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ గ్రూపును మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే నేతృత్వంలోని అసలు శివసేనలో వ...