భారతదేశం, అక్టోబర్ 11 -- హిందువుల అత్యంత పవిత్రమైన పండుగలలో శారదీయ నవరాత్రులు ఒకటి. శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని భక్తిశ్రద్ధలతో కొలిచే ఈ తొమ్మిది రోజులు ఆధ్యాత్మిక ఉత్సాహంతో కళకళ్ళాడుతుంది. ఈ ప్రత్యేకమైన మరియు పవిత్రమైన సమయంలో భక్తులు తమ శక్తికొద్దీ అమ్మవారిని పూజిస్తూ, కుటుంబంలో సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు మరియు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటారు.

కేవలం పూజలతోనే కాకుండా, నవరాత్రులలో నిరుపేదలకు, ఆకలితో ఉన్నవారికి సేవ చేయడం ద్వారా విశేషమైన పుణ్యఫలం లభిస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నవరాత్రులలో ప్రతి ఒక్కరూ తమ తమ రాశులకు అనుగుణంగా కొన్ని ప్రత్యేక పరిహారాలు పాటిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఏ రాశి వారు ఏ రంగు వస్తువులను అమ్మవారికి సమర్పించాలి? ఏయే వస్తువులను దానం చేయడం ద్వారా శుభ ...