భారతదేశం, అక్టోబర్ 10 -- ఈ ఏడాది శారదీయ నవరాత్రులు అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి, జ్యోతిష్య నిపుణుల అంచనాల ప్రకారం ఈ తొమ్మిది రోజులు మీ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయో ఇక్కడ పూర్తిగా తెలుసుకోండి.

తెలుగువారి అత్యంత పవిత్రమైన, భక్తిశ్రద్ధలతో జరుపుకునే శారదీయ నవరాత్రుల పర్వదినం రానే వస్తోంది. ఆశ్వయుజ మాసంలో పాడ్యమి తిథి నుంచి ఈ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమవుతాయి. ఈ ఏడాది అక్టోబర్ 11, ఆదివారం రోజున ఘటస్థాపనతో నవరాత్రులు మొదలుకాగా, అక్టోబర్ 19న మహానవమి వేడుకలు జరగనున్నాయి.

అమ్మవారు ఈసారి గజవాహనం (ఏనుగు)పై వస్తుండడం అత్యంత శుభకరమని, అయితే కోడివాహనంపై ప్రయాణించి ప్రస్థానం చేయడం మాత్రం అంతగా మంచిది కాదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ తొమ్మిది రోజుల్లో సూర్య భగవానుడు తులా రాశిలోకి ప్రవేశించడం,...