భారతదేశం, మార్చి 11 -- ఆరోగ్యంగా ఉండాలని అందరికీ ఉంటుంది, కానీ మనకు తెలియకుండానే చేసే కొన్ని పనులు మనల్ని మృత్యువుకు దగ్గర చేస్తాయి. ముఖ్యంగా ఒకే ఒక్క అలవాటు శరీరంలోని దాదాపు ప్రతి అవయవాన్ని లోలోపల చెదపురుగులా తినేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాతికేళ్లకు పైగా అనుభవం ఉన్న ప్రముఖ కార్డియోవాస్కులర్ సర్జన్ డాక్టర్ జెరెమీ లండన్, గుండె ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఒక సంచలన విషయాన్ని పంచుకున్నారు.

ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన ఆయన, మనిషి ఆరోగ్యాన్ని అత్యంత వేగంగా దిగజార్చే ఆ అలవాటు మరేదో కాదు.. 'ధూమపానం' (Smoking) అని స్పష్టం చేశారు.

గుండె సర్జన్‌గా తన సుదీర్ఘ కెరీర్‌లో వేలమంది రోగులను చూసిన డాక్టర్ జెరెమీకి, "మీరు అసలు తాకని లేదా పూర్తిగా దూరంగా ఉండే అలవాటు ఏది?" అనే ప్రశ్న ఎదురైంది. దానికి ఆయన ఏమాత్రం తడుముకోకుండా "స్మోకింగ్" అని స...