భారతదేశం, అక్టోబర్ 19 -- విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా మహోత్సవాలు అత్యంత వైభవంగా ముగింపు దశకు చేరుకున్నాయి. ఉత్సవాల్లో అత్యంత ఘట్టమైన, భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెప్పోత్సవం అక్టోబర్ 20న కృష్ణానదిలో కన్నుల పండువగా నిర్వహించడానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. గత రెండేళ్లుగా కృష్ణా నదికి వచ్చిన వరదల కారణంగా రద్దయిన ఈ దివ్య వేడుక, ఈ ఏడాది ఎలాంటి ఆటంకాలు లేకుండా జరగనుండటంతో భక్తుల్లో ఉత్సాహం నెలకొంది.

దసరా నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించే తెప్పోత్సవం కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని, స్వామివారిని తెప్పపై కొలువుచేసి కృష్ణానదిలో విహరింపజేసేందుకు వీలుగా హంస వాహనాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. దుర్గాఘాట్ వద్ద అధికారులు ఇప్పటికే హంస వాహన ...