భారతదేశం, నవంబర్ 26 -- శబరిమలకు వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులు, భక్తులకు ప్రయాణ కష్టం కలగకుండా డిసెంబర్ 2026, జనవరి 2027 నెలల్లో 'ట్రైన్ ఆన్ డిమాండ్' (TOD) ప్రాతిపదికన ప్రత్యేక శబరి రైళ్లు నడపనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ మీదుగా సాగే ఈ రైళ్లతో వేలాది మంది భక్తులకు ఎంతో ఊరట దక్కనుంది.

ఈ ప్రత్యేక రైళ్లలో మొత్తం 24 కోచ్‌లు ఉంటాయి. వాటిలో 1ఏసీ కోచ్ 1, 2ఏసీ కోచ్‌లు 2, 3ఏసీ కోచ్‌లు 6, స్లీపర్ కోచ్‌లు 9, జనరల్ కోచ్‌లు 4, జనరల్ సిట్టింగ్ కమ్ లగేజ్ రేక్‌లు 2 ఉంటాయి.

ఈ రైళ్లు బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, యాద్గిర్, రాయచూరు, మంత్రాలయం రోడ్డు, ఆదోని, గుంతకల్, గుత్తి, అనంతపురం, ధర్మవరం, కదిరి, మదనపల్లె రోడ్డు, పిలేరు, పాకాల, చిత్తూరు, కాట్పాడ...