భారతదేశం, జనవరి 20 -- శబరిమల ఆలయంలో మండల-మకరవిళక్కు మహోత్సవం ముగియడంతో ఆలయాన్ని మూసివేశారు. మంగళవారం ఉదయం 6.45 గంటలకు పందాళం రాజకుటుంబ ప్రతినిధి పునర్‌తమ నాళ్ నారాయణవర్మ దర్శనం అనంతరం ఆలయాన్ని మూసివేయడం సంప్రదాయంగా వస్తుంది. మంగళవారం ఉదయం 5 గంటలకు ఆలయాన్ని తెరిచి.. పూజలు ప్రారంభించారు.

పెరియస్వామి మరుతువన శివన్‌కుట్టి నేతృత్వంలోని 30 మంది సభ్యుల బృందం తిరువాభరణంతో అటవీ మార్గం గుండా తిరిగి వెళ్తోంది. జనవరి 23న పందాళం శ్రీంబిక్కల్ ప్యాలెస్‌కు పవిత్ర ఆభరణాలతో చేరుకుంటుంది. ప్రధాన పూజరి ప్రసాద్ నంబూదిరి అయ్యప్ప విగ్రహానికి విభూతియాభిషేకం చేసి, మెడలో రుద్రాక్ష మాల, చేతిలో యోగా కర్రను ఉంచారు. తర్వాత హరివరాసన గానం తర్వాత దీపం వెలిగించి గర్భగుడి నుండి బయలుదేరి, మూసివేశారు. అయ్యప్ప ఆలయం తాళం చెవిని పందాళం రాజకుటుంబ ప్రతినిధికి ఇచ్చారు.

ఆయన 18వ మ...