శబరిమలలో ఇది ఆచారం కాదు.. ఏపీ ప్రభుత్వానికి లేఖలో ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు
భారతదేశం, నవంబర్ 16 -- ప్రతి ఏడాది మాదిరిగానే ఈఏడాది కూడా శబరిమల ఉత్సవానికి విస్త్రతమైన ఏర్పాట్లు చేసినట్టు తిరువనంతపురం ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు(Travnacore Devaswom Board) ఛైర్మన్ కె.జయకుమార్.. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్‌కి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రతి ఏటా అధిక సంఖ్యలో అయ్యప్ప మాలదారులైన అయ్యప్ప భక్తులు శబరిమలను సందర్శించుకుంటారని గుర్తు చేశారు.
మరికొన్ని రోజుల్లో రెండు నెలల పాటు జరిగే శబరిమల పండుగ మహోత్సవం ప్రారంభం కానున్న నేపథ్యంలో భక్తులకు సంతృప్తికరమైన యాత్రా అనుభవాన్ని అందించేందుకు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు విస్తృతమైన ఏర్పాట్లు చేసిందని తెలిపారు. గతంలో గుర్తించిన పలు లోపాలను సరిదిద్దినట్టుగా వెల్లడించారు. ముఖ్యంగా పారిశుద్ధ్య నిర్వహణలో గణనీయమైన మార్పులు తీసుకొచ్చామన్నారు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.