భారతదేశం, ఆగస్టు 18 -- వైదిక జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడిని న్యాయం, కర్మ, అనుశిక్షణకు కారకుడిగా భావిస్తారు. మనిషి చేసిన పనులకు తగిన ఫలితాన్ని ఇచ్చే దేవుడిగా శని భగవానుడిని కొలుస్తారు. జాతకంలో శని ఏ స్థానంలో ఉన్నారనే దానిని బట్టి ఫలితాలు మారుతుంటాయి. తాజాగా శని దేవుడు మిత్ర గ్రహమైన బుధుడి నక్షత్రంలోకి ప్రవేశించారు.

జనసామాన్యానికి ఇది ఎంతో శుభ ఫలితాలను ఇస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మీన రాశిలో వక్ర స్థితిలో ఉన్న శని, రాబోయే డిసెంబర్‌లో ప్రత్యక్షంగా సంచారం చేయనున్నాడు. డిసెంబర్‌లో శని మార్గి కావడం వల్ల మరిన్ని అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. శని ఈ నక్షత్రంలో అక్టోబర్ 9 వరకు సంచారం చేయనున్నారు. ఆ తర్వాత దీని ద్వితీయ పాదంలోకి ప్రవేశిస్తారు.

బుధుడి నక్షత్రంలోకి శని ప్రవేశించడం వల్ల కన్యా రాశి వారికి అత్యంత అనుకూలమైన...