భారతదేశం, జూలై 30 -- గ్రహాలు కాలానుగుణంగా వాటి రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితాల్లో అనేక విధాలుగా ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రంలో కర్మఫలదాతగా శనిని చెబుతారు. శని భగవానుడి అనుగ్రహం కలిగితే అనేక విధాలుగా ప్రయోజనాలను పొందవచ్చు. అదే ఒకవేళ శని వల్ల ఇబ్బందులు వస్తే, అనేక విధాలుగా సమస్యలతో బాధపడాల్సి ఉంటుంది.

శని ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించడానికి రెండున్నరేళ్ల సమయం పడుతుంది. శని సంచారం, దృష్టి ప్రభావం కారణంగా రానున్న మూడేళ్ల కాలం రెండు ప్రత్యేకమైన రాశులకు ఊహించని విధంగా లాభాలు కలగబోతున్నాయి. ఈ రెండు రాశుల వారికి ఇదే గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. అపారమైన ఐశ్వర్యం కలుగుతుంది. విజయాలను అందుకుంటారు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? ఈ రెండు రాశుల్లో మీరు ఒకరేమో చూసుకో...