భారతదేశం, ఏప్రిల్ 19 -- కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌తో రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. రాష్ట్రంలోని శనగ, మొక్కజొన్న రైతుల పరిస్థితులను వివరించారు. రాష్ట్రంలో ఈ ఏడాది శనగ సాగు పెరిగి 7.13 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చిన నేపథ్యంలో, ఇప్పటికే 94,500 మెట్రిక్ టన్నుల కొనుగోలు పూర్తయిందని, మిగిలిన పంటను కూడా కొనుగోలు చేయాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వ విన్నపానికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. పీఎస్ఎస్ స్కీం కింద అదనంగా 15,000 మెట్రిక్ టన్నుల శనగ కొనుగోలుకు తక్షణమే అనుమతి ఇచ్చారు. మిగిలిన 68,750 మెట్రిక్ టన్నుల శనగలను కూడా త్వరలోనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని తెలిపారు.

మిరప, పొగాకు రైతులు పంటల వైవిధ్యీకరణ చేపట్టడం వల్ల ఈ ఏడాది మొక్కజొన్న సాగు విస్త...