భారతదేశం, మే 1 -- ఔటర్ రింగ్ రోడ్డు (ORR) మరోసారి నెత్తురోడింది. శంషాబాద్ వద్ద జరిగిన ఒక భయంకర రోడ్డు ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. అతివేగం ప్రాణసంకటంగా మారి ఆరుగురిని బలితీసుకుంది. శంషాబాద్ పరిధిలోని ఎగ్జిట్-16 వద్ద రోడ్డు పక్కన ఆగివున్న ఒక లారీని, వెనుక నుంచి వచ్చిన కారు అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే.. కారు లారీ వెనుక భాగంలోకి దూసుకుపోయి నుజ్జునుజ్జయ్యింది.

ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉండటం అందరినీ కలిచివేస్తోంది. ప్రమాదంలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. కారు లారీ కింద ఇరుక్కుపోవడంతో మృతదేహాలను వెలికితీయడానికి పోలీసులు తీవ్రంగా శ్రమించ...