భారతదేశం, అక్టోబర్ 24 -- హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ విదేశీ కరెన్సీ పట్టుబడింది. ఎటువంటి చట్టబద్ధమైన పత్రాలు లేకుండా విదేశాలకు తరలిస్తున్న సుమారు రూ. 1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని జప్తు చేయడమే కాకుండా. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు ప్రయాణికులను అరెస్ట్ చేసినట్లు డీఆర్ఏ అధికారులు వెల్లడించారు.

డీఆర్‌ఐ హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులకు అందిన స్పష్టమైన సమాచారం ఆధారంగా ఈ తనిఖీలు చేపట్టారు. అక్టోబర్ 22న హైదరాబాద్ నుంచి మలేషియా రాజధాని కౌలాలంపూర్ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన భారతీయ పురుష ప్రయాణికుడిని అనుమానంతో అడ్డుకున్నారు. అతడి వద్ద ఉన్న క్యాబిన్ బ్యాగేజీని సమగ్రంగా సోదా చేయగా అక్రమ రవాణా ఉదంతం వెలుగులోకి వచ్చింది.

ట్రాలీ బ్యాగ్‌లోని బట్టల మధ్య నల్లటి ప్లాస్టిక్ కవర్‌లో దాచిన విదేశీ కరెన్సీని అధి...