భారతదేశం, ఆగస్టు 18 -- ముంబై: నిరంతర నష్టాలతో సతమతమవుతున్న వొడాఫోన్ ఐడియా (వీఐ) షేర్ ధర సోమవారం, ఆగస్టు 18న అనూహ్యంగా పుంజుకుంది. ఇంట్రాడే లావాదేవీల్లో ఏకంగా 4% పెరిగి ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. ఆర్థిక సంవత్సరం 2025-26 మొదటి త్రైమాసికం (Q1 FY26)లో కంపెనీ నష్టాలు తగ్గడమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. బలమైన భారతీయ స్టాక్ మార్కెట్ సెంటిమెంట్ కూడా దీనికి తోడైంది.

సోమవారం, వొడాఫోన్ ఐడియా షేర్ ధర రూ. 6.28 వద్ద ప్రారంభమైంది. ఇది గత ముగింపు ధర కంటే 2% అధికం. ఒక దశలో ఈ షేర్ ధర రూ. 6.40 గరిష్ఠ స్థాయిని తాకింది. ఇది గత ముగింపు ధరతో పోలిస్తే 4.06% పెరుగుదల.

నిజానికి, వొడాఫోన్ ఐడియా తన జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను మార్కెట్ ముగిసిన తర్వాత ఆగస్టు 14, గురువారం నాడు ప్రకటించింది. ఈ ఫలితాల్లో కంపెనీ నికర నష్టం రూ. 6,608 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక...