భారతదేశం, మార్చి 23 -- ప్రతి గ్రహానికి కూడా ప్రత్యేకత ఉంటుంది. గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను, నక్షత్రాలను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వస్తే, అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకు వస్తుంది. త్వరలోనే వైభవ లక్ష్మీ రాజయోగం ఏర్పడబోతోంది.

ఏప్రిల్ 18న చంద్రుడు, శుక్రుడు కలయిక ఏర్పడడంతో ఈ వైభవ లక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది. శుక్రుడు డబ్బు, విలాసాలు, ప్రేమ, అందం మొదలైన వాటికి కారకుడు. చంద్రుడు మానసిక ప్రశాంతతను తీసుకొస్తాడు. ఈ రెండు గ్రహాల కలయికతో కొన్ని రాశుల వారు అనేక లాభాలను పొందబోతున్నారు.

శుక్రుడు మార్చి 26న మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 18న చంద్రుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఇది వైభవ లక్ష్మీ రాజయోగాన్ని అందిస్తుంది. ఈ రాజయోగంతో కొన్ని రాశుల వారు ఆర్థికపరంగా లాభాలను పొం...