భారతదేశం, జూన్ 9 -- Visakhapatnam Steel Plant Tragedy : విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలో (వైజాగ్ స్టీల్ ప్లాంట్) చోటుచేసుకున్న ఘోర ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. సోమవారం జరిగిన ఈ దురదృష్టకర దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కార్మికుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున భారీ ఎక్స్‌గ్రేషియా (పరిహారం) అందజేయనున్నట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ప్రకటించారు. అదేవిధంగా.. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉద్యోగుల కుటుంబాలకు సైతం రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ఆయన వెల్లడించారు.

విశాఖ ఉక్కు కర్మాగారంలోని ఎస్‌ఎమ్‌ఎస్-2 (SMS-2), ఎస్‌టీసీ-3 (STC-3) హీట్ ఫెసిలిటీ విభాగాల నుంచి సోమవారం ఒక్కసారిగా భారీ ఎత్తున ద్రవరూప ఉక్కు (మోల్టెన్ స్టీల్) లీక్ కావడంతో ఈ దారుణమైన ప్రమాదం సంభవించింది. ఈ దుర్...