Andhrapradesh,vizag, అక్టోబర్ 5 -- విశాఖపట్నం సమీపంలోని ఐఎన్ఎస్ కళింగ ప్రాంగణంలో తుపాకీ కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో సెంట్రీ గార్డుగా విధులు నిర్వర్తిస్తున్న 44 ఏళ్ల బాజీ బాబా షేక్ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఇది ఆత్మహత్య.? లేదా గన్ మిస్ ఫైర్ అయిందా..? అనే దానిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘటనపై ఓ అధికారి పీటీఐతో మాట్లాడారు. "అతను సెంట్రీ విధుల్లో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగింది. తుపాకీ కాల్పుల గాయంతో మరణించాడు. ఇది ఆత్మహత్యా.? లేదా గన్ మిస్ ఫైర్ అయిందా.? అనేది ఇంకా తేలలేదు" అని చెప్పారు.

"ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నాం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మరణానికి కచ్చితమైన కారణం తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది" అని సదరు అధికారి వివరించారు.

ఈ మృతిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని ...