Andhrapradesh, సెప్టెంబర్ 18 -- విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఎయిరిండియా ఎక్స్ ప్రెస్ విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. గురువారం మధ్యాహ్నం 103 మంది ప్రయాణికులతో ఓ సర్వీస్ హైదరాబాద్ కు బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన కొద్దిసేపట్లోనే ఇబ్బంది తలెత్తింది. ఆ వెంటనే అప్రమత్తమైన సిబ్బంది. అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

ఈ ఘటనపై విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ ఎస్ రాజారెడ్డి స్పందిస్తూ . "ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం (నంబర్ IX 2658) పైలట్ అత్యవసర ల్యాండింగ్ కోసం అభ్యర్థించారు. వెంటనే తిరిగి ల్యాండింగ్ చేశారు. వైజాగ్ నుంచి బయలుదేరిన తర్వాత ఇంజిన్ లో కొంత సమస్య ఉన్నట్లు పైలెట్ నివేదించాడు. కాబట్టి. అతను అత్యవసర ల్యాండింగ్ కోసం కోరాడు. వెంటనే వైజాగ్ కు తిరిగి వచ్చాడు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది" అని పీటిఐకి చెప్పారు.

సరిగా ఈ విమానం మ...