భారతదేశం, ఏప్రిల్ 6 -- రాష్ట్ర వ్యాప్తంగా పీఎం సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు అందిస్తున్న 6 లక్షల ఉచిత సోలార్ విద్యుత్ కనెక్షన్లను వేసవిలోపు పూర్తి చేస్తామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. సోలార్‌తో ప‌ర్యావ‌ర‌ణానికి ఎటువంటి న‌ష్టం లేని నాణ్యమైన విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు.

పీఎం సూర్యఘ‌ర్ ప‌థ‌కంలో భాగంగా ప‌ల్నాడు జిల్లా గురజాల నియోజ‌క‌వ‌ర్గంలోని నాగేశ్వర‌పురం తండాలో 79 కుటుంబాల‌కు ఏర్పాటు చేసిన సోలార్ యూనిట్‌ను స్థానిక ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస‌రావు, ఎంపీ లావు శ్రీకృష్ణ దేవ‌రాయ‌లుతో క‌లిసి మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ., రాష్ట్రంలోని 200 యూనిట్లలోపు వినియోగించే 6 ల‌క్షల ఎస్సీ, ఎస్టీ కుటుంబాల‌కు 2 కిలోవాట్ల సోలార్ యూనిట్లను ఉచితంగా ...