Hyderabad, ఆగస్టు 14 -- దైవ భక్తి అన్నది మన హిందూ సమాజంలో యుగయుగాలుగా వస్తున్న వారసత్వ విశ్వాసం. మన సంస్కృతిలో చెట్టు, పుట్ట, జీవి, జంతువూ అన్నీ దైవస్వరూపాలే! ముక్కోటి దేవతలూ మనకి ఉన్నారు. వీటిలో కొన్నింటికి ఆలయాలు నిర్మించి, నిత్య పూజలు చేస్తూ ముల్లోకాధిపతి అయిన దేవదేవుని పట్ల మన భక్తిని ప్రదర్శిస్తున్నాం. ఈ కారణంగా ప్రతి గ్రామంలో ఒక పురాతన ఆలయం కనపడుతుంది. పలు కారణాల వల్ల ఆ ఆలయాలు గ్రామాలలో నిర్మించినట్లు తెలుస్తోంది.

హిందూ ధర్మం, పురాణ ఇతిహాసాల అర్థం పరమార్థం సమాజ అట్టడుగు స్థాయి వరకు అంటే విద్యా గంధం అంతగా లేని పల్లె ప్రజల వరకు చేరాలన్నది ముఖ్యమైన అంతరార్థం, ప్రయాణికులు, బాటసారులు, భగవంతుని సందర్శించుకోవడం మరొక సంబంధిత అంశం అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

యుద్ధ సమయాలలో సైని...