భారతదేశం, ఫిబ్రవరి 26 -- ఖమ్మంలోని వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలపై రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. అర్హులైన ప్రతి పేదవారికి ఇంటి స్థలం, ఇళ్లు ఇచ్చే బాధ్యత తనదని చెప్పారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రులు పొన్నం, వివేక్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ. పేదల ఆశీర్వాదంతో నిలబడిన ప్రభుత్వం తమదని చెప్పారు. ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టదని స్పష్టం చేశారు. వెలుగుమట్లలో పేదవాళ్ల ఇళ్లు కూలగొడుతున్నాం అని బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

2023 జూలై 15న వెలుగుమ‌ట్ల‌లో నాటి బీఆర్ఎస్ ప్ర‌భుత్వమే పేద‌ల ఇండ్ల‌ను కూల‌గొట్టించిందని మంత్రి పొంగులేటి గుర్తు చేశారు. అంతేగాక వెలుగుమెట్లలో పేద‌ల‌కు ఇండ్లు తిరిగి క‌ట్టిస్తామ...