భారతదేశం, ఏప్రిల్ 9 -- వెన్నుపూస సమస్య అనగానే చాలామందిలో ఒక రకమైన భయం ఉంటుంది. ఆపరేషన్ విఫలమైతే జీవితాంతం మంచాన పడాల్సి వస్తుందేమో అన్న ఆందోళన రోగులను వేధిస్తుంటుంది. అయితే, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఈ భయాలకు తెరదించుతోంది. హైదరాబాద్ బేగంపేటలోని కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్, వెన్నుపూస శస్త్రచికిత్సల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశంలోనే మొట్టమొదటి సారిగా 'సేఫ్ స్పైన్ సర్జరీ సూట్' (Safe Spine Surgery Suite) టెక్నాలజీని గురువారం ఘనంగా ప్రారంభించింది.

ఈ సందర్భంగా కిమ్స్ సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్ చైర్మన్, ప్రముఖ సర్జన్ డాక్టర్ ఎ.వి. గురవారెడ్డి మాట్లాడుతూ, గతంలో వెన్నుపూస సర్జరీల్లో అనేక ఇబ్బందులు ఉండేవని గుర్తు చేశారు. "ఒకప్పుడు టెక్నాలజీ లేకపోవడం వల్ల సర్జరీల్లో కాంప్లికేషన్లు వచ్చేవి. కానీ ఇప్పుడు స్పైన్ నావిగే...