భారతదేశం, జనవరి 4 -- అమెరికా-వెనెజువెలా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వైరం ఒక్కసారిగా ముదిరింది. దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాపై అమెరికా సైన్యం భారీ దాడి చేసి, ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను తమ అదుపులోకి తీసుకుంది.

తాజా సమాచారం ప్రకారం.. మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరస్‌ను న్యూయార్క్ ఎయిర్ బేస్‌కు తరలించి, అక్కడి నుంచి బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉంచారు. వీరిద్దరిపై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా (డ్రగ్ ట్రాఫికింగ్), ఆయుధాల చట్టం కింద తీవ్రమైన కేసులు నమోదయ్యాయి. కళ్లకు గంతలు కట్టిన మదురో ఫోటోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

స్థానిక కాలమానం ప్రకారం శనివారం తెల్లవారుజామున వెనెజువెలా రాజధాని కారకాస్​లో అమెరికా దాడులు జరిపింది. పేలుడు శబ్ధాలతో ఆ నగరం ఉలిక్కిపడింది. అదే సమయంలో మ...