వెదర్ రిపోర్ట్ : ఉపరితల ఆవర్తన ప్రభావం - ఇవాళ, రేపు వర్షాలు..! ఎల్లుండి నుంచి తెలంగాణలో పొడి వాతావరణం
భారతదేశం, నవంబర్ 6 -- తూర్పు తెలంగాణ దానిని అనుకుని ఉన్న కోస్తాంధ్ర ప్రాంతాలపై నిన్నటి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల కొన్ని రోజుల పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన ఏడు రోజుల వాతావరణ నివేదిక ప్రకారం.నవంబర్ 6 నుండి 7 ఉదయం వరకు రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులు మరియు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.