భారతదేశం, సెప్టెంబర్ 24 -- అల్పపీడనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతోంది. మరికొన్ని గంటల్లో బలహీనపడే అవకాశం ఉంది. అయితే గురువారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. అది శుక్రవారం నాటికి వాయుగుండంగా మారనుందని ఐఎండీ తెలిపింది. ఈ వాయుగుండం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరంలో ఈ నెల 27వ తేదీన తీరం దాటనుంది. ఈ నెల 30 తేదీ వరకు దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది.

సెప్టెంబర్ 26, 27 తేదీల్లో తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది.

'ఇది దాదాపు పశ్చిమ దిశగా కదులుతూ సెప్టెంబర్ 26న దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలకు దూసుకెళ్లి వాయువ్య, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా వాయుగుండంగా మార...