భారతదేశం, సెప్టెంబర్ 29 -- తెలుగు రాష్ట్రాల్లో మరికొన్ని రోజులు వర్షాలు తగ్గేలా లేవు. అల్పపీడనం ప్రభావంతో ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. అండమాన్ సమీపంలో బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని ఐఎండీ తెలిపింది. దీంతో ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అక్టోబర్ 1న అల్పపీడనం ఏర్పడనుందని అంచనా వేసింది.

అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు దక్షిణ గుజరాత్ విదర్భ, దక్షిణ ఛత్తీస్‌గఢ్, దక్షిణ ఒడిశా, కోస్తాంధ్ర మీదుగా సగటున సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీంతో తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శా...