భారతదేశం, ఆగస్టు 28 -- సెప్టెంబర్ 1 నుండి గృహ బడ్జెట్‌లు, రోజువారీ ఖర్చులను ప్రభావితం చేసే కొన్ని మార్పులు అమల్లోకి వస్తాయి. వెండి హాల్‌మార్కింగ్ నుండి ఎస్బీఐ కార్డు నిబంధనలు, ఎల్పీజీ ధర సవరణలు, ఏటీఎం నగదు ఉపసంహరణ రుసుములు, ఎఫ్‌డీ వడ్డీ రేట్లలో మార్పుల వంటివి ఉన్నాయి. ఈ 5 కొత్త రూల్స్ అన్నీ వినియోగదారులను నేరుగా ప్రభావితం చేస్తాయి.

బంగారం మాదిరిగానే వెండికి కూడా తప్పనిసరి హాల్‌మార్కింగ్‌ను అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. స్వచ్ఛత, ధరల ప్రమాణాలను నిర్ధారించడం ద్వారా వెండి మార్కెట్‌కు ఎక్కువ పారదర్శకతను తీసుకురావడమే దీని లక్ష్యం. ఈ చర్య విశ్వసనీయతను పెంచుతుందని భావిస్తున్నప్పటికీ, ఇది వెండి ధరలను కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. వెండి ఆభరణాలను కొనాలని లేదా పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్న వారు కొత్త నియమాలను ...