భారతదేశం, మార్చి 17 -- ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలోని గోమతీ నగర్‌లో ఉన్న ప్రతిష్టాత్మక రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (RMLIMS) మంగళవారం ఉదయం రణరంగాన్ని తలపించింది. శ్వాసకోస సమస్యతో చేరిన ఒక రోగి మరణించడంతో.. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే ఈ మృతి సంభవించిందని ఆరోపిస్తూ బంధువులు వీరంగం సృష్టించారు.

గుడంబా ప్రాంతానికి చెందిన లాల్ బహదూర్ (45) తీవ్రమైన శ్వాస ఇబ్బందులతో ఆసుపత్రికి వచ్చారు. అయితే, ఆయనను చేర్చుకోవడంలో డాక్టర్లు జాప్యం చేశారని, పరిస్థితి విషమించాక వెంటిలేటర్ల కొరత ఉందంటూ కాలయాపన చేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. "మేము సహాయం కోరితే డాక్టర్లు మమ్మల్ని ఎమర్జెన్సీ వార్డు నుంచి బయటకు నెట్టేశారు. మహిళా బంధువుల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించారు" అని మృతుడి బావ ప్రదీప్ కుమార్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో ఆగ్...