భారతదేశం, నవంబర్ 16 -- బిల్డింగ్ దీ వీకెండ్ టూరిజం ఎకానమీ అనే అంశంపై గచ్చిబౌలిలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో సదస్సు ఏర్పాటు చేశారు. వీకెండ్ పర్యాటక ఆర్థిక వ్యవస్థను నిర్మించడంపై దేశంలోనే మొట్టమొదటి సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇచ్చింది. రిసార్ట్ యజమానులు, పర్యాటక నిర్వాహకులు, విద్యార్థులు సహా అనేక మంది సమావేశమై, హైదరాబాద్ వంటి నగరాల్లో చిన్న బ్రేక్స్‌కు స్థిరమైన ఆర్థిక కార్యకలాపాలుగా ఎలా మార్చుకోవచ్చో చర్చించారు.

వారాంతపు ప్రయాణం తెలంగాణలో అత్యంత ఆశాజనకమైన విభాగాలలో ఒకటిగా మారిందని పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. 'ఐటీ, లైఫ్ సైన్సెస్ రంగాలలో దాదాపు 2.5 మిలియన్ల మంది ఉద్యోగులు రిఫ్రెష్ కోసం తరచుగా చిన్న విరామాలను కోరుకుంటారు. గతంలోలా కాకుండా, పర్యాటకం ఇకపై ఒక అభిరుచి కాదు. న...