భారతదేశం, డిసెంబర్ 5 -- హైదరాబాద్, 05 డిసెంబర్ 2025: స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ (SIH) 2025 - హార్డ్‌వేర్ ఎడిషన్ గ్రాండ్ ఫినాలేను నిర్వహించడానికి హైదరాబాద్‌లోని వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ (వీఎన్ఆర్ వీజీఐఈటీ) నోడల్ సెంటర్‌గా ఎంపికైంది. డిసెంబర్ 8 నుంచి డిసెంబర్ 12, 2025 వరకు ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం జరగనుంది. విద్యా మంత్రిత్వ శాఖ (MoE) ఆధ్వర్యంలో, AICTE మరియు MoE యొక్క ఇన్నోవేషన్ సెల్‌తో కలిసి వీఎన్ఆర్ వీజీఐఈటీ ఈ అతిపెద్ద విద్యార్థి-కేంద్రీకృత ఇన్నోవేషన్ ఉద్యమానికి కేంద్రంగా నిలుస్తోంది.

దేశవ్యాప్తంగా మొత్తం 72,000 కంటే ఎక్కువ ఐడియాల సమర్పణ, 68,000 పైగా జట్లు పాల్గొనడం చూస్తే.. SIH 2025 ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతటి భారీ కార్యక్రమానికి నోడల్ సెంటర్‌గా ఎంపిక కావడం వీఎన్ఆర్ వీజీఐఈటీకి దక్కిన...