భారతదేశం, సెప్టెంబర్ 1 -- రాజకీయ చరిత్రలో కొన్ని పేర్లు కేవలం ఓట్ల లెక్కింపునకు, ఎన్నికల్లో గెలుపోటములకు మాత్రమే పరిమితం కావు. అవి ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్న విశ్వాసానికి, సామాజిక న్యాయ పోరాటానికి, చెరిగిపోని ఒక ఆశయానికి ప్రతీకలుగా నిలుస్తాయి. సరిగ్గా అలాంటి ఒక అరుదైన, రాజకీయ ప్రభంజనమే జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.

వెండితెరపై కోట్లాది మంది అభిమానాన్ని చూరగొని.. అగ్రస్థానంలో ఉన్నవారెవరైనా తమ ప్రజాదరణను ఆధారం చేసుకుని అధికారం కోసం, పదవుల కోసం రాజకీయాల్లోకి వస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్ అలా రాలేదు. సకల సౌఖ్యాలను, సురక్షితమైన జీవితాన్ని, కళ్లు చెదిరే పారితోషికాలను వదులుకుని...నిత్యం సమస్యలతో నలిగిపోయే పేద ప్రజల కష్టాలను తీర్చడానికి కంటకప్రాయమైన ముళ్ల బాటను ఎంచుకున్నారు.

సెప్టెంబర్ 2న ఆయన పుట్టిన రోజు సందర్భంగా... ఒక ఆశయ...