విశాఖ పోర్ట్ కోసం హెచ్ఎస్ఎల్ రెండో టగ్ నౌక నిర్మాణానికి శ్రీకారం!
భారతదేశం, సెప్టెంబర్ 5 -- ప్రభుత్వ రంగ సంస్థ హిందూస్థాన్ షిప్‌యార్డ్ లిమిటెడ్(HSL) మరో కీలక మైలురాయిని చేరుకుంది. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ(VPA) కోసం ప్రత్యేకంగా తయారుచేస్తున్న 60 టన్నుల బోలార్డ్ పుల్ టగ్ నౌక 'VC 11206' నిర్మాణ పనులను అధికారికంగా ప్రారంభించింది. దీనికి సంబంధించిన కీలకమైన కీల్ లేయింగ్ కార్యక్రమాన్ని వీపీఏ ఛైర్పర్సన్ జస్మీత్ సింగ్ బింద్రా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
గతేడాది డిసెంబర్లో ఈ టగ్ నౌకల తయారీ ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో స్టీల్ కటింగ్ నిర్వహించి, ప్రస్తుతం అనుకున్న సమయానికి కీల్ లేయింగ్ పూర్తి చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా నిర్మిస్తున్న మొదటి టగ్ నౌక తయారీ ఇప్పటికే 60 శాతం పూర్తికాగా, రెండో దాన్ని కూడా అంతే వేగంగా పూర్తిచేసి రాబోయే అక్టోబరు మాసంలో రెండింటినీ ఒకేసారి నీటిలోకి ప్రవేశపెట్టనున్నారు.
1...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.