విశాఖ : కైలాసగిరి, జూ పార్క్, కంబాలకొండ అనుసంధానంతో ఇంటిగ్రేటెడ్ ఎకో-టూరిజం ప్లాన్!
భారతదేశం, జూలై 4 -- విశాఖపట్నం నగర పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ఒక బృహత్తర ప్రణాళిక సిద్ధమవుతోంది. విశాఖను పర్యాటక హబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు, పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ ఒక సమగ్ర ఇంటిగ్రేటెడ్ ఎకో-టూరిజం డెవలప్మెంట్ ప్లాన్(Integrated Eco-Tourism Development Plan)ను విశాఖపట్నం ఎంపీ ఎం. శ్రీభరత్ ప్రతిపాదించారు. నగరంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన కైలాసగిరి, ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ (జూ పార్క్), కంబాలకొండ వన్యప్రాణి అభయారణ్యాన్ని ఒకదానితో ఒకటి అనుసంధానిస్తూ ఈ భారీ ప్రాజెక్టును చేపట్టనున్నారు.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాథమిక ప్రతిపాదనలపై విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఎంపీ శ్రీభరత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో వీఎంఆర్డీఏ మెట్రో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.