Andhrapradesh, ఆగస్టు 8 -- విశాఖపట్నం సిటీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఫిషింగ్‌ హార్బర్‌ సమీపంలో గ్యాస్‌ సిలిండర్‌ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి.వీరిలోనూ ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. క్షత్రగాత్రులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన ముగ్గురి కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.

గురువారం రాత్రి ఫిషింగ్ హార్బర్ సమీపంలోని వెల్డింగ్ షాపులో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

ఈ పేలుడులో ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు విశాఖ సిటీ డీసీపీ-2 మేరీ ప్రశాంతి తెలిపారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వివరించారు.

గ్యాస్ సి...