విశాఖలో నీటి కొరత.. అందుబాటులోకి డయల్-ఎ-ట్యాంకర్ సేవలు!
భారతదేశం, ఆగస్టు 7 -- గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) నగరంలో తాగునీటి ఎద్దడిని పరిష్కరించడానికి అత్యవసర చర్యలు చేపట్టింది. పౌరులకు నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా యుద్ధప్రాతిపదికన పనులు చేపడుతున్నట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గర్గ్ ఒక ప్రకటనలో తెలిపారు. నగరవాసులకు త్వరితగతిన, సులభంగా వాటర్ ట్యాంకర్లను అందించేందుకు నీటి సరఫరా విభాగం డయల్-ఎ-ట్యాంకర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ సేవలకు మొదటి రోజే విశేష స్పందన లభించిందని, సాయంత్రం 7 గంటల సమయానికి కార్పొరేషన్ సిటీ ఆపరేషన్స్ సెంటర్లో సుమారు 245 బుకింగ్లు నమోదయ్యాయని కమిషనర్ పేర్కొన్నారు. నీటి అవసరం ఉన్నవారికి సకాలంలో ట్యాంకర్లు అందేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రజలు జీవీఎంసీ సిటిజన్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నీటి ట్యాంకర్లను బుక్ చేసుకునే సదు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.