భారతదేశం, అక్టోబర్ 1 -- విశాఖలో గూగుల్ సంస్థ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. అయితే భూ సేకరణ విషయంలో మాత్రం కొంత వివాదం నడుస్తోంది. భూసేకరణను వ్యతిరేకిస్తూ.. రైతుల పేర్లతో కోర్టులో తప్పుడు కేసులు వేయడం, చనిపోయిన వ్యక్తిపేరు కూడా ఉండటంపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఆటంకాలు సృష్టిస్తే ఉపేక్షించేది లేదని చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. రైతుల డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించాలన చెప్పారు. భూ సేకరణ వేగవంతం చేయాలన్నారు.

ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టులకు ఆటంకాలు కలిగించే.. ఆలోచనలతో వైసీపీ పెద్దల తరఫున పని చేస్తున్న బినామీల విషయంలై చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. భూములు ఇచ్చిన రైతులకు ఉద్యోగవకాశాలు, ఉపాధి కోసం షాపింగ్ కాంప్లెక్స్, ఇళ్ల నిర్మాణానికి 3 సెంట్ల స్థలంపై ఎమ...