Andhrapradesh,viskapatanm, అక్టోబర్ 2 -- పశ్చిమమధ్య,ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతోంది. విశాఖపట్నంకి 300కి.మీ, గోపాల్‌పూర్(ఒడిశా)కి 300 కి.మీ,పారాదీప్ (ఒడిశా)కి 400 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైంది. ఇవాళ రాత్రికి గోపాల్‌పూర్- పారాదీప్ మధ్య ఒడిశా-ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

ఈ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం,మన్యం,అల్లూరి, విశాఖ,అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. కాకినాడ,కోనసీమ, తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

తాజా వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఉత్తరాంధ్ర తీరం వెంబడి 55-75 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి.తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో అతిభారీ వర్షాలు పడొచ్చని ఏపీ విపత్తు...