విశాఖలో ఆగస్టు 14న అమరావతి ఛాంపియన్షిప్ జిల్లా స్థాయి సెలక్షన్స్
భారతదేశం, ఆగస్టు 12 -- జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్-2026 జిల్లా స్థాయి పోటీలు, ఎంపిక ప్రక్రియ ఈ నెల 14న విశాఖపట్నంలో జరగనుంది. కొమ్మాదిలోని శాప్ (SAAP) ఇంటీగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ పోటీలను ఏర్పాటు చేయనున్నట్లు విశాఖ జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఆర్. జూన్ గాలియట్ తెలిపారు.
హాకీ దిగ్గజం, భారతరత్న ద్యాన్‌చంద్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 29న దేశవ్యాప్తంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా క్రీడాకారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ ఛాంపియన్‌షిప్‌ను రూపొందించారు.
ఈ జిల్లా స్థాయి పోటీలకు సంబంధించి ప్రాథమిక ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. గత జూలై 27 నుండి 31 వరకు జిల్లా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.