భారతదేశం, సెప్టెంబర్ 13 -- వినాయక చవితి 2026: వినాయక చవితి నాడు వినాయకుడికి ఇష్టమైన ఈ నైవేద్యాలను సమర్పిస్తే వినాయకుని అనుగ్రహం కలిగి శుభ ఫలితాలను చూడొచ్చు. వినాయక చవితి నాడు ఏ ప్రసాదాలను చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే వినాయకుడికి ఇష్టమైన ఈ ప్రసాదాలను తప్పక తయారు చేయండి. వినాయకుని పూర్తి అనుగ్రహంతో సంతోషంగా ఉండండి.

వినాయక చవితి నాడు గణపతికి సాంప్రదాయంగా సమర్పించే ముఖ్యమైన నైవేద్యాలు ఇవి. వినాయకుడికి ఉండ్రాళ్లు, కుడుములు, పాయసం, బూందీ లడ్డు, పులిహోర, చలిమిడి, పానకం, వడపప్పు, కొబ్బరి, అరటి పండ్లు, ఇతర పండ్లను నైవేద్యంగా పెట్టడం మంచిది. అలాగే వినాయకుని పూజలో కచ్చితంగా ఎర్ర మందారాలు, గరిక, కొబ్బరి కూడా ఉండేటట్టు చూసుకోవాలి.

ఒక కప్పు బియ్యం రవ్వ, రెండు కప్పుల నీళ్లు, రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, ఒక టీ స...