భారతదేశం, సెప్టెంబర్ 14 -- విఘ్నేశుడి పూజా మహోత్సవాలకు వేళయింది. దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్ 14, సోమవారం రోజున గణేశ చతుర్థి పర్వదినం వచ్చింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మండపాలు, ఇళ్లలో కొలువుదీరే గణపయ్యకు భక్తులు ఘనంగా స్వాగతం పలకనున్నారు. అయితే ఈ పండుగ రోజు ఎంతటి భక్తి ఉందో, అంతే కఠినమైన కొన్ని నమ్మకాలు, ఆచారాలు కూడా ఉన్నాయి. అందులో ప్రధానమైనది చంద్రదర్శనం చేయకూడదనే నిబంధన. ఈ రోజే చంద్రుడిని చూస్తే అపనిందలు కలుగుతాయని నమ్ముతారు. అసలు ఈ సాంప్రదాయం వెనుక ఉన్న అసలు కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

పురాణాల ప్రకారం ఒకసారి గణేశుడు తన వాహనమైన మూషికంపై వెళ్తూ ఉండగా, అకస్మాత్తుగా కింద పడిపోయారు. ఆ సమయంలో ఆకాశం నుంచి ఇదంతా చూస్తున్న చంద్రుడు బిగ్గరగా నవ్వాడు. తన రూ...