భారతదేశం, సెప్టెంబర్ 9 -- విఘ్నాలను తొలగించే వినాయకుడిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. పనుల్లో కలిగే ఆటంకాలు తొలగిపోయి, అన్ని పనులను సమయానికి పూర్తి చేయొచ్చు. అలాగే, వినాయకుని ఆరాధించడం వలన ఆ వినాయకుని అనుగ్రహంతో కుటుంబమంతా సంతోషంగా ఉండొచ్చు.

వినాయక చవితి రాబోతోంది. ప్రతి ఏటా భాద్రపద మాసంలో వచ్చే చవితి రోజు వినాయక చవితిని జరుపుకుంటాము. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్ 14, సోమవారం నాడు వచ్చింది. వినాయక చవితికి ముందే ఇంటి నుంచి వస్తువులను తొలగించడం మంచిది. ఇలా చేయడం వలన ఆ గణపతి అనుగ్రహాన్ని పొందడానికి వీలవుతుంది.

వాస్తు ప్రకారం అనుసరించడం వలన సానుకూల శక్తి వ్యాపించి, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వినాయక చవితికి ముందు ఇంటి నుంచి వీటిని తొలగిస్తే ప్రతికూల శక్తిని పూర్తిగా తొలగించి, అనుకూల శక్తిని పొందవచ్చు.

ఇంట్లో ఎప్పుడూ కూడా పచ్చని మొ...