భారతదేశం, ఆగస్టు 26 -- వినాయక చవితి అనగానే ముందుగా గుర్తొచ్చేది గణపతికి అత్యంత ఇష్టమైన మోదకాలు. వినాయకుడిని బుద్ధి, ఐశ్వర్యానికి అధిపతిగా భావించి దేశవ్యాప్తంగా, ఈ పది రోజుల పండుగను ఘనంగా జరుపుకుంటారు. గణపతికి 21 మోదకాలను నైవేద్యంగా సమర్పిస్తే శుభం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.

సాధారణంగా మోదకాలను బియ్యం పిండితో తయారు చేసి, మధ్యలో బెల్లం, కొబ్బరి తురుముతో కూడిన తీపి మిశ్రమాన్ని పెట్టి చేస్తారు. అయితే, ఇప్పుడు మోదకాల్లో ఎన్నో కొత్త రకాలు వచ్చాయి. ప్రతి ఏటా ఒకే రకం మోదకాలు నైవేద్యంగా పెడుతున్న వారు, ఈసారి మరింత వైవిధ్యమైన మోదకాలను, బర్ఫీలను చేసి గణపతికి సమర్పించవచ్చు.

ప్రముఖ చెఫ్ అయిన సంజీవ్ కపూర్ అందించిన ఐదు అద్భుతమైన మోదక్, బర్ఫీ వంటకాలను ఇక్కడ అందిస్తున్నాం. వీటిని తయారు చేసి, వినాయకుడి ఆశీస్సులు పొందడంతో పాటు, కుటుంబ సభ్యులు, స్నేహితు...