భారతదేశం, ఫిబ్రవరి 25 -- వినాయకుడు తొలి పూజలను అందుకుంటాడు. మొట్టమొదట వినాయకుడిని ఆరాధించడం వలన విఘ్నాలన్నీ తొలగిపోతాయని అంటారు. అందుకనే ఏదైనా పని లేదా శుభకార్యం మొదలు పెట్టినప్పుడు ముందుగా వినాయకుడిని ఆరాధిస్తాము. వినాయకుడిని పూజించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయని, విఘ్నాలు, ఆటంకాలు, అడ్డంకులు ఏమైనా ఉన్నా అవి తొలగిపోతాయని నమ్ముతారు.

వినాయకుడిని పూజించిన తర్వాత, వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత మొట్టికాయలు వేసుకోవడం చూస్తుంటాము. అసలు ఎందుకు అలా చేస్తారు? దాని వెనుక ఉన్న కథ ఏంటి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

దశకంఠుడైన రావణాసురుడు కష్టపడి భక్తితో పరమేశ్వరుడుని మెప్పించాడు. శివుని ఆత్మలింగాన్ని పొంది, లంకానగరంలో దానిని ప్రతిష్టించి తన తల్లికి ఇచ్చిన మాటను ఎలాగైనా నెరవేర్చుకోవాలని వెళ్తున్నాడు. అప్పుడు మార్గమధ్యంలో సంధ్య వార్చుకోవడాని...