భారతదేశం, సెప్టెంబర్ 5 -- తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు బొగ్గు ఉత్పత్తి, రవాణాను వేగవంతం చేయాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) యాజమాన్యం నిర్ణయించింది. వర్షాలు తగ్గడంతో అన్ని బొగ్గు గని ప్రాంతాల్లో రోజువారీగా 1.9 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, రవాణా చేయాలని అన్ని విభాగాలు, ఏరియా అధికారులను ఆదేశించింది.

హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో నిర్వహించిన ప్రత్యేక సమీక్షా సమావేశంలో సింగరేణి ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (CMD) డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి అన్ని ఏరియాల డైరెక్టర్లు, జనరల్ మేనేజర్లతో బొగ్గు ఉత్పత్తిపై మాట్లాడారు. భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే రోజువారీ కేటాయించిన లక్ష్యాలను మించి బొగ్గును ఉత్పత్తి చేసి, రైళ్ల ద్వారా రవాణా చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా డాక్టర్ బుద్ధప్రకాష్ జ్...